Agriculture

1న ఆర్‌-5 జోన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

1న ఆర్‌-5 జోన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఆర్‌-5 జోన్‌ కేసుపై సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. రాజధాని పరిధిలోని ఈ జోన్‌లో నిర్మాణాలు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో తమ వాదనలూ వినాలని అమరావతి రైతులు కేవియట్‌ దాఖలు చేశారు. ఆర్‌-5 జోన్ కేసును జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. అమరావతి రాజధాని కేసుపైనా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరుపుతోంది.