NRI-NRT

శుక్రవారం నుండి అట్లాంటాలో “ఆప్త” మహాసభలు

శుక్రవారం నుండి అట్లాంటాలో “ఆప్త” మహాసభలు

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(APTA) 15వ వార్షికోత్సవ మహాసభలు అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినిమా, కళా, సాహిత్య, నాటక, సేవా, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొంటారని కన్వీనర్ గుడిసేవ విజయ్ తెలిపారు.

కార్యక్రమాల్లో భాగంగా పవన్ కళ్యణ్ జన్మదిన వేడుకలు, పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, కోటి, మణిశర్మ, రఘు కుంచె సంగీత విభావరి, శ్రీనివాస కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.