Politics

నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం: చంద్రబాబు

నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు,  అక్కలకు, చెళ్లల్ల అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు మహిళను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దుతాం అన్నారు. బంధాలు భారతీయ సంస్కృతికున్న ప్రత్యేకత అని తెలిపారు. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటున్నారు.మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసి టీడీపీ ఎన్నో కార్టక్రమాలు.. సంస్థలు స్థాపించింది అని తెలిపారు చంద్రబాబు.మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించారని.. పద్మావతి మహిళ కళాశాలను నెలకొల్పింది టీడీపీనే అని గుర్తు చేశారు. బాలికా సంవృద్ధి సంరక్షణా పథకం తానే ప్రారంభించాను అని తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామన్నారు. ఒక విధానంతో ఆడబిడ్డల జీవితాలు మారే విధంగా విధాన నిర్ణయాలు చేశాం.మహిళలతో పొదుపు ఉద్యమం చేయించామని, ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ టీడీపీనే అన్నారు. ఆడబిడ్డ నిధితో మహిళలను ఆదుకుంటాం అని చెప్పారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం.. అవసరమైతే మరోక సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు చంద్రబాబు.