Politics

అమిత్ షా తెలంగాణలో మరోసారి పర్యటన

అమిత్ షా తెలంగాణలో మరోసారి పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. ఇటీవలే ఖమ్మంలో రైతు గోస బీజేపీ భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభకి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ సభ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది.. 4జీ, 3జీ, 2జీ పార్టీలు కాదని.. ప్రజల పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు అమిత్ షా తాజాగా మరో సారి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొందిస్తుంది. ఈ పర్యటనలో అమిత్ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమిత్ షా రానున్నారు. గత ఏడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారికంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి వరంగల్ లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కేంద్ర భద్రత దళాలతో వరంగల్ లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ కవాతులో అమిత్ షా గౌరవ వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ హై కమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారింది.