Politics

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ అనుమతి

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ అనుమతి

విదేశాలకు వెళ్లేందుకు  ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి  సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  యూకే పర్యటనకు వెళ్లాలని  సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు.ఈ మేరకు  కోర్టులో అనుమతి కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ వరకు  జగన్ విదేశీ పర్యటనకు  సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది. యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు వెళ్లేందుకు అనుమతివ్వాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్  కోర్టును అనుమతిని కోరారు. కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు వెళ్తున్నట్టుగా కోర్టుకు ఆయన తెలిపారు.యూకే వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన కోరారు.