Politics

చంద్రబాబుకు ఐటీ నోటీసులు

చంద్రబాబుకు ఐటీ నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందాయని సమాచారం అందుతోంది. అమరావతి కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు ముట్టాయని సమాచారం. ఈ క్రమంలో.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది.బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారట ఆదాయ పన్ను శాఖ అధికారులు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందట. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారట. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.