Politics

కాంగ్రెస్‌లోకి రావాలని తుమ్మలకు రేవంత్‌రెడ్డి ఆహ్వానం

కాంగ్రెస్‌లోకి రావాలని తుమ్మలకు రేవంత్‌రెడ్డి ఆహ్వానం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత మల్లు రవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్‌లోకి రావాలని వారు ఆహ్వానించారు. రేవంత్‌ విజ్ఞప్తిపై మాజీ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ టికెట్‌ దక్కక పోవటంతో తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజులుగా భారాసకు దూరంగా ఉన్నారు. ఇటీవల తన అనుచరులతో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తే పాలేరు టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.