Politics

అమెరికాకు పయనమైన బండి సంజయ్‌

అమెరికాకు పయనమైన బండి సంజయ్‌

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ఇవాళ ఉదయం అమెరికా పర్యటనకు బయలుదేరారు. అమెరికాలో ఆయన 10 రోజులపాటు ఉండనున్నారు. శనివారం రోజున బండి సంజయ్ అట్లాంటాలో జరిగే ఆప్టా వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో 6 పట్టణాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులకు ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరవనున్నారు.నార్త్ కరోలినా, వర్జీనియా, న్యూజెర్సీ, డల్లాస్, టెక్సాస్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ ప్రవాస సంఘాలతో బండి సంజయ్‌ సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తైన తర్వాత ఆయన ఈ నెల 10వ తేదీన స్వదేశానికి తిరిగిరానున్నారు. బండి సంజయ్ అమెరికా వస్తున్న నేపథ్యంలో ఎన్​ఆర్​ఐకు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన యూఎస్ చేరుకున్న తర్వాత మొదట మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.