Politics

సోనియాగాంధీతో ముగిసిన షర్మిల భేటీ

సోనియాగాంధీతో ముగిసిన షర్మిల భేటీ

తెలంగాణలో కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారంనాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయినట్టుగా వైఎస్ షర్మిల చెప్పారు. తమ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు.తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు నిరంతరం పనిచేస్తూనే ఉంటుందన్నారు. వైఎస్ బిడ్డగా తాను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని ఆమె తెలిపారు.సోనియాగాంధీతో భేటీ కోసం నిన్న సాయంత్రమే వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ లు న్యూఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయం సోనియాతో షర్మిల సమావేశమయ్యారు.