కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హోమ్ మినిస్టర్ అమిత్ షా మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొన్నారు. మోదీతో జరుగుతున్న ఈ సమావేశంలో హోమ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా హాజరు అయినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా ఈ మీటింగ్ ను ఏర్పాటు చేయడానికి గల కారణాలను చూస్తే, త్వరలో ప్రత్యేక సమావేశాల పేరుతో అయిదు రోజులు పార్లమెంట్ సమావేశాలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఎప్పుడు అన్నది ఇంకా షెడ్యూల్ ను ఖరారు చేయలేదు.. అందుకే షెడ్యూల్ ను నిర్ణయించడానికి మరియు ఈ సమావేశాలలో ఏ ఏ బిల్లులను ప్రవేశపెట్టాలి అన్న విషయంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సభలో ప్రవేశ పెట్టి దీనిపై చర్చ జరపడానికి చూస్తున్నారు. ఇక ఇది కాకుండా మరికొన్ని అంశాలకు సంబంధించి కొన్ని బిల్లులను ఈ సభలో ప్రవేశ పెట్టనున్నారు.