Politics

షెడ్యూల్‌ ప్రకారమే ఈసీ ఎన్నికలు నిర్వహించాలి: తలసాని

షెడ్యూల్‌ ప్రకారమే ఈసీ ఎన్నికలు నిర్వహించాలి: తలసాని

తాజాగా ఎన్నికల సర్వేలు పరిశీలిస్తే ఏ రాష్ట్రంలోనూ భాజపా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. దేశంలో జమిలి ఎన్నికల ప్రచారంపై ఆయన స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారమే ఈసీ ఎన్నికలు జరిపించాలని సూచించారు. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ నినాదం పేరిట ఓ ప్రతిపాదన తెరపైకి తీసుకురావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకే జమిలి ఎన్నికల అంశం తెరపైకి తెచ్చారని తలసాని విమర్శించారు.తెలంగాణలో ఉంది కేసీఆర్‌ సర్కారు.. దేనికీ భయపడేది లేదని ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ మాది.. భాజపాకు నిబద్ధత లేదని ఆక్షేపించారు. కేంద్రంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. పార్లమెంట్‌కు దీనికి లింకు పెడుతున్నారు.. అన్ని రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్‌ రద్దు చేసి జమిలి ఎన్నికలకు వెళ్తే ఉత్తమం అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.