NRI-NRT

అమెరికాలో భారతీయుల బంగారం దుకాణంలో చోరీ

అమెరికాలో భారతీయుల బంగారం దుకాణంలో చోరీ

అమెరికాలోని భారతీయులు, ఆసియా దేశస్తుల ఆభరణాల దుకాణాలలో లూటీలకు తెగబడుతున్న ముఠాకు చెందిన 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో 8 మందిని గతంలోనే అరెస్టు చేయగా.. తాజాగా మరో 8 మందిని అరెస్టు చేశామని కొలంబియా జిల్లా పోలీసు విభాగం వెల్లడించింది. ఈ గ్యాంగ్‌లోని సభ్యులు 2022 జనవరి నుంచి 2023 జనవరి 27 మధ్యకాలంలో న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా, ఫ్లోరిడాలలోని 9 జ్యువెల్లరీ షాపుల్లో లూటీలు చేశాయి. వీటిలో నాలుగు షాపులు భారత సంతతి వారివేనని పోలీసులు వెల్లడించారు.