Politics

రేపు కడప జిల్లాలో జగన్‌ పర్యటన

రేపు కడప జిల్లాలో జగన్‌ పర్యటన

రేపు కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి జగన్‌…ఆ తర్వాత వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్నారు.

అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి జగన్‌. ఇక అటు.. ఇవాళ కడప జిల్లా పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. రేపు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్నారు షర్మిల. ఇందులో భాగంగానే ఇవాళ కడప జిల్లా పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. ఈ మేరకు షర్మిల అనుచరులు అన్ని ఏర్పాట్లు చేసారు.