Sports

వర్షం కారణంగా భారత్ పాక్‌ మ్యాచ్‌ రద్దు

వర్షం కారణంగా భారత్ పాక్‌ మ్యాచ్‌ రద్దు

వర్షం కారణంగా భారత్, పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్‌ ఆరంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. తొలుత భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. మొత్తంమ్మీద టీమ్‌ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచగా.. ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితమయ్యారు. తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేశారు. ఆటగాళ్లు కూడా గ్రౌండ్‌లోకి అడుగుపెడుతుండగా మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు డగౌట్‌లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వర్షం మరింత ఎక్కువైంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.