టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 201వరోజు శుక్రవారం ఉత్సాహంగా సాగింది. ఉదయం కొయ్యలగూడెం మండలం ఆరిపాటిదిబ్బలు దాటాక తూర్పు గోదావరి జిల్లా పోతవరం పరిధిలోకి ప్రవేశించింది. పాదయాత్ర 200వ రోజు కార్యక్రమం కొయ్యలగూడెం మండలంలో నిర్వహించడం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
నేడు 202 వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది.. నేటీ షెడ్యూల్:-
ఉదయం 8 గంటలకు – నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం క్యాంపు సైట్ నుంచి ప్రారంభం అయ్యింది.
10.00 – సింగరాజుపాలెంలో ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశం
11.00 – ఉంగుటూరు మండలం నీలాద్రిపురంలోకి ప్రవేశం
11.15 – నీలాద్రిపురంలో యాదవ సామాజిక వర్గీయులతో భేటీ
1.30 – ఉంగుటూరులో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు – ఉంగుటూరు నుంచి పాదయాత్ర ప్రారంభం
4.30 – ఉంగుటూరు కూడలిలో బీసీ సామాజిక వర్గీయులతో భేటీ
5.30 – నారాయణపురంలోకి ప్రవేశం
5.50 – నారాయణపురం శివాలయం వద్ద ఎస్సీ సామాజిక వర్గీయులతో మాటామంతీ
8.50 – నిడమర్రు మండలం చిననిండ్రకొలనులోకి ప్రవేశం
9.20 – చిననిండ్రకొలను కూడలిలో ఆక్వా రైతులతో సమావేశం
9.30 – చిననిండ్రకొలనులో రాత్రి బస