NRI-NRT

షార్లెట్‌లో ఎంపీ రఘురామ పర్యటన

షార్లెట్‌లో ఎంపీ రఘురామ పర్యటన

అమెరికా పర్యటనలో భాగంగా నర్సాపూర్ పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణంరాజు ఉత్తర కరోలినాలోని షార్లెట్‌లో పర్యటించి స్థానిక ప్రవాసులతో సమావేశమయ్యారు. నాగ పంచుమర్తి ఆయన్ను ఆహ్వానించి స్వాగతం పలికారు. ఠాగూర్‌ మల్లినేని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.వైఎస్‌.జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అధోగతి పాలయిందని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన విధానం, ఫేక్‌ ఉచిత తాయిలాలు, తన నియోజకవర్గం నరసాపురం వెళ్ళడానికి సృష్టిస్తున్న ఇబ్బందులు, 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. అనంతరం అందరికీ విందు భోజనం అందించారు. బాలాజి తాతినేని, సతీష్‌ నాగభైరవ, శ్రీమాన్ రావి, సురేష్ కొత్తపల్లి తదితరులు సమన్వయపరిచారు.