DailyDose

85 ఏళ్ల మహిళపై అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

85 ఏళ్ల మహిళపై అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

85 ఏళ్ల మహిళపై అత్యాచారం

శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో 85 ఏళ్ల మహిళపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ ఘటన మీద స్పందించారు. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.వివరాలోకి వెడితే.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో శుక్రవారం 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటన మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ 28 ఏళ్ల ఆకాష్‌గా గుర్తించబడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన మీద ఢిల్లీ మహిళా కమిషన్ తన ఎక్స్ హ్యాండిల్‌లో ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను మహిళను కొట్టి, బ్లేడుతో పెదవులను కోశాడు.వివరాల ప్రకారం.. వృద్ధురాలి ముఖానికి, ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్ర గాయాలయ్యాయి. కేసుకు సంబంధించి ఇతర వివరాలతో పాటు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) కాపీని తనకు అందించాలని డిసిడబ్ల్యు చీఫ్ నోటీసులో ఢిల్లీ పోలీసులను కోరారు.ఢిల్లీలో వృద్ధురాలిపై జరిగిన అత్యాచారంపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఢిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య 

దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీ) ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డాడు. త‌న హాస్ట‌ల్ గ‌దిలో ఉరేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. మృతుడిని 21 ఏళ్ల అనిల్‌ కుమార్‌గా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అనిల్‌ మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌లో బీటెక్ చ‌దువుతున్నాడు. అతను క్యాంపస్‌లోని వింద్యాంచల్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. హాస్టల్‌ నిబంధనల ప్రకారం అనిల్‌ గత జూన్‌లో రూమ్‌ను ఖాళీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని  సబ్జెక్ట్‌లు తప్పడంతో అవి క్లియర్‌ చేసేందుకు మరో ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ క్రమంలో అనిల్‌ గురువారం గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు తిరిగి రాకపోవడంతో హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా. అనిల్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. అయితే సబ్జెక్టులు తప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. విద్యార్థి గ‌దిలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేదు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.ఇదిలా ఉండగా ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గత రెండు నెలల్లో ఇది రెండో  ఘటన. జూలై 10న బీటెక్ (మ్యాథ్స్) చదువుతున్న ఆయుష్ అష్నా అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందాడు.

*   ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో పెళ్లైన నాలుగు నెలలకే భార్యను భర్త హత్య చేశాడు. భార్యను చంపిన అనంతరం పరారయ్యేందుకు యత్నించిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన మోహితె జైవంత్, పద్మ దంపతుల కుమారుడు అరుణ్ మేస్త్రీ పని చేస్తున్నాడు.నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీప అనే యువతితో అరుణ్ కు ఈ ఏడాది మే5న వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అరుణ్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో నాగులపంచమికి పుట్టింటికి వెళ్లిన దీపను ఆమె తల్లిదండ్రులు ఆగస్టు29న అల్లుడు అరుణ్ తో మెట్టినింటికి పంపారు.గురువారం రాత్రి దీపతో అరుణ్ గొడవ పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున దీపను మంచానికి కట్టేసి గొంతు నులిమి చంపాడు. అనంతరం అరుణ్ తన బైక్ పై పారిపోయాడు. దీప విగతజీవిగా కనిపించడంతో ఆమె అత్తామామలు షాక్ అయ్యారు. అరుణ్ కు ఫోన్ చేయగా దీపను తానే చంపినట్లు తెలిపాడు. ఈ క్రమంలో మమతా జిన్నింగ్ సమీపంలో అరుణ్ బైక్ లారీని వేగంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తామామలే తమ కూతురి ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*  ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త మోసం

ప్రతి రోజు ఒక కొత్త పంథా తో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు..ఒక్క otp తో లక్షలు కాజేస్తునారు..ఎక్కడ ఉంటారో తెలీదు…ఎలా ఉంటారో తెలీదు కానీ మన బ్యాంక్ ఖాతాల నుండి మాత్రం లక్షల కొద్ది లక్షలు మాయం చేసేస్తున్నారు…మనకి తెలీకుండానే మనతోనే మన otp చెప్పించుకుని ఖాతాకు కొల్లగొడుతున్నారు… తాజగా చాలాన్ కట్టాలంటే మెసేజ్లు పంపుతూ బాధితుల ఖాతాలకు చిల్లు పెడుతున్నారు.. ఈ తరహా ఫ్రాడ్స్ హైదరాబాద్  సిటీలో చాలా జరుగుతున్న ఫిర్యాదు చేసేందుకు బాధితులు మాత్రం ముందుకు రావడం లేదు.. సాధారణంగా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించగానే ట్రాఫిక్ సిబ్బంది క్యాప్చూర్ చేసే కెమెరాల ద్వారా మన వాహనానికి చలాన్ విధిస్తారు. ఆ చలానికి సంబంధించిన ఫైన్ మనకి మెసేజ్ రూపంలోనూ ట్రాఫిక్ పోలీసులు పంపిస్తుంటారు. అయితే ఇటీవల చాలా వరకు ట్రాఫిక్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మన వాహనంపై చలాన్ ఉంటే ట్రాఫిక్ సిబ్బంది మన వాహనాన్ని పక్కకు ఆపి వాళ్లు పంపించిన పేమెంట్ లింక్ ద్వారా మన చల్లాన్ క్లియర్ అయ్యే చర్యను చేపడుతున్నారు. ఆ పేమెంట్ లింక్ క్లిక్ చేయగానే మన చలాన్ పే చేసే పేజి ఓపెన్ అవుతుంది.. తద్వారా మన పెండింగ్ చలాన్ క్లియర్ చేయబడుతుంది.ఇప్పుడు ఇదే అవకాశాన్ని మలుచుకున్న సైబర్ కేటుగాళ్లు ట్రాఫిక్ చలాన్ల పేరుతో కొత్త తరహా నేరానికి తెరలేపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పంపించిన విధంగా ఒక పేమెంట్ లింక్ ని క్లిక్ చేసి మీ చలాన్ క్లియర్ చేసుకోండి ఒక టెక్స్ట్ మెసేజ్ ని కేటుగాళ్లు పంపిస్తున్నారు. నిజంగానే ట్రాఫిక్ చలాన్ ఉందేమో అనుకుని ఆ లింకును క్లిక్ చేసిన వెంటనే తమ అకౌంట్లో నుండి డబ్బు మాయమైపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఫేక్ చలాన్ పేమెంట్ లింకులపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలాంటి నేరాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం.అయితే ఇటువంటి ఫ్రాక్స్ జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలని దానిపై ట్రాఫిక్ పోలీసులు ఒక సూచన చేశారు. ఏదైనా అనుమానాస్పద ట్రాఫిక్ చలాన్ లింక్ వచ్చినప్పుడు నేరుగా తెలంగాణ స్టేట్ ఈ చలాన్ వెబ్సైట్ కి వెళ్లి పేమెంట్ చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.టీఎస్ ఈ చలాన్ వెబ్సైట్ కి వెళితే మన వాహనం నంబర్ కొట్టగానే ఎన్ని చలానాలు ఉన్నాయో చూపించటంతో పాటు వాటిని క్లియర్ చేసుకునే వెసులుబాటు సైతం ఆ వెబ్సైట్లో ఉందంటున్నారు పోలీసులు.. చలాన్స్ పేమెంట్ కి సంబంధించిన మెసేజ్ లింక్ వస్తే క్రాస్ చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో అమానుష ఘటన

రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు. దానికి అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. అయితే ఆ మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ధరియావద్ పోలీస్​స్టేషన్​​ పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ ​మీడియాలో వీడియో వైరల్​ కావడం వల్ల శుక్రవారం సాయంత్రం పోలీసులకు తెలిసింది. వెంటనే జిల్లా ఎస్పీతోపాటు పోలీస్​ సిబ్బంది గ్రామానికి చేరుకుని. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.బాధితురాలికి ఏడాది కిత్రం వివాహమైందని.. ఆమె గ్రామంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె అత్తమామలు, భర్త గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారని డీజీపీ ఉమేశ్ మిశ్రా తెలిపారు. గురువారం.. ఆమెను కిడ్నాప్​ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి అత్తమామలు, భర్త ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.  ఈ కేసులో నిందితులందర్నీ అరెస్ట్​ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

*  అమలాపురంలో పట్టపగలు యువకులపై దాడి 

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లిలో గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త పోలిశెట్టి కిషోర్‌ (28), అడపా సాయిలక్ష్మణ్‌ (26) గురువారం రాత్రి కొందరు యువకులపై దాడి చేశారు. ప్రతీకారంగా అవతలి వర్గం యువకులు శుక్రవారం మధ్యాహ్నం కర్రలతో వచ్చి వీరిద్దరినీ చావబాదారు. ఈ ఘటనలో కిషోర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, సాయిలక్ష్మణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కిషోర్‌ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వైకాపా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి ఘటనతో ఈదరపల్లికి చెందిన సతీష్‌, ఇంద్ర, గూడాలకు చెందిన సుధీర్‌, కొంకాపల్లికి చెందిన ఆనంద్‌ అనే యువకులకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం హత్య జరగడం, సాయంత్రం తరువాత పట్టణంలో మరో పార్టీ నాయకుడికి చెందిన దుకాణానికి దుండగులు నిప్పుపెట్టడంతో కలకలం రేగింది. దాంతో 200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు

ఆ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు

ఇటీవల కాలంలో జరుగుతున్న నేరాలు, దొంగతనాలు,గంజాయి రవాణా, హత్యలు, అత్యాచారాలు వంటి కేసుల్లో అత్యధికంగా యూపీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, ఎంపీ,పంజాబ్ తదితర రాష్ట్రలకు చెందిన వారే ఎక్కువుగా నిందితులుగా తేలుతున్నారు. హైదరాబాద్ మహా నగరానికి పొట్టకూటి కోసం అంటూ పనుల నిమిత్తం వచ్చి ఎదురు తిరిగితే హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో మూడు కమిషనరేట్ పోలీసులు పనుల నిమిత్తం వచ్చే వారిపై ఫోకస్ పెట్టారు.డ్రమ్ములో డెడ్ బాడి.. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. పూరన్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో జయదేవి అనే మహిళ కీలక పాత్ర పోషించింది. అయితే ఆ మహిళ యూపీకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు.. తన ప్రేమను తిరస్కరించాడు అని పథకం ప్రకారం యూపీ నుండి వచ్చి హైదరాబాద్‌లో పూరాన్ సింగ్‌ను హత్య చేసి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసింది.ఇంకా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మైనర్ బాలుడి ని హత్య చేసిన ఘటన మైలరదేవ్ పల్లి రాణా పరిధిలో చోటుచేసుకుంది.. బీహార్ నుండి పనుల నిమిత్తం వచ్చిన పంకజ్ పాష్వన్ అనే వ్యక్తి రాజా పాష్వన్ అనే మైనర్ బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. ఈ కేసులో కూడా బీహార్ నుండి వచ్చిన వ్యక్తి బాలుదీని హత్య చేయడంతో స్థానికంగా కలకలం రేపింది.అలాగే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నానక్ రాం గూడలో ఓ మహిళ మృతదేహం కుళ్ళిపోయిన పరిస్థితిలో కనిపించింది.. మహిళను పై అత్యాచారం చేసి బండ రాయితో మోది హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు దర్యాప్తు చేయగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద పనిచేస్తున్నటువంటి బెంగాల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళను మద్యం మత్తులో అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఇద్దరు నిందితుల అరెస్టు చేసిన పోలీసులు వారు పనుల నిమిత్తం నగరానికి వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు.ఇక గంజాయి సైబర్ క్రైమ్ నేరాలు సంబంధించి ఎక్కువగా రాజస్థాన్ ఢిల్లీ నుంచి సైబర్ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా నేరగలలో పడుతూనే ఉన్నారు నగర ప్రజలు మరోవైపు ఒడిస్సా నుంచి విపరీతంగా గంజా రవాణా జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పటికే కొన్ని బందల కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేస్తున్నప్పటికీ కొత్త పద్ధతుల ద్వారా ప్రమాణాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు ఈ విధంగా మూడు కమిషనర్ల పరిధిలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

*  విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని మృతి

విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని రితీ సాహా అనమానాస్పద మృతి కేసుపై బెంగాల్ పోలీసులు కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో బెంగాల్ పోలీసులు విశాఖకు వచ్చి విచారణ చేశారు. రితీ సాహా అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు చేధించారు. కాలేజ్‌ యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే రితీ సూసైడ్‌కు కారణమని తేల్చారు విశాఖ పోలీసులు. కేసులో సెక్షన్స్ మార్చి బైజూస్, హాస్టల్‌ సిబ్బందిని అరెస్ట్ చేశారు. రితీ సాహ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడడంతో మృతిచెందినట్టు పేర్కొంటూ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు మొదట కేసు నమోదుచేశారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతికి బైజూస్‌-ఆకాశ్‌ యాజమాన్యం, హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. బైజూస్ సిబ్బంది, హాస్టల్ వార్డన్‌ అరెస్ట్ చేసిన పోలీసులు.. యాజమాన్యం నిర్లక్ష్యమే రితీ ఆత్మహత్యకు కారణమని నిర్ధారించారు. బైజూస్ మేనేజర్ రాజేశ్వర్ రావ్, ఆపరేషన్స్ హెడ్ రవికాంత్‌, సాధన హాస్టల్ యజమాని సూర్య కుమారి, వార్డెన్ గన్ను కుమారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈ కేసులో సెక్షన్‌ 174 నుంచి సెక్షన్‌ 304- పార్ట్ 11కి కేసు మార్పు చేశారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రితీసాహా జూలై 14న విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విశాఖలోని ఆకాష్ బైజూస్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటూ నరసింహనగర్ లో ఉన్న సాధనా హస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి పడి రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విశాఖపట్టణం పోలీసుల తీరుపై మృతురాలి తండ్రి సుఖ్ దేవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాలతో కోల్‌కతా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. బెంగాల్ పోలీసులు విశాఖకు వచ్చి విచారణ జరుపుతున్న సమయంలో వైజాగ్ పోలీసులు కీలక అరెస్టులు చేశారు.

*   బీహార్‌లోని  కతిహార్‌ జిల్లాలో అమానుష ఘటన

మహిళను వేధిస్తున్నాడని  యువకునికి అరగుండు చేయించి మెడలో చెప్పుల దండేసి ఊరేగించిన ఘటన బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆనంద్‌ అనే వ్యక్తి కబర్‌లోని ఓ పిండి మిల్లులో  పనిచేస్తున్నాడు. దీంతో యజమాని రాజీవ్‌ కుమార్‌ ఇంటికి రెగ్యులర్‌గా వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజీవ్‌ భార్యతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు గత కొంతకాలంగా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి ఆనంద్‌ తనను వేధిస్తున్నాడని ఆమె తన భర్తకు చెప్పింది. గత మూడు నెలలుగా సతాయిస్తున్నాడని, సమయం సందర్భం లేకుండా ఫోన్‌ చేస్తున్నాడని, ఇంటికి వస్తున్నాంటూ తెలిపింది.దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనంద్‌ను పట్టుకుని.. ఓ గుంజకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అర గుండు గీయించారు. మెడలో పాత బూట్లతో చేసిన దండ వేసి ఊరేగించారు. కాగా, అమాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఆ మహిళే ఆనంద్‌కు తరచూ ఫోన్‌ చేసేదని, ఇంటికి రావాలని పిలిపించుకునేదని చెప్పారు. అయితే ఆమెతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరుపక్షాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో అనంతరం పోలీసులు అతడిని వదిలిపెట్టారు.

క్లాస్‌గా తయారై వచ్చి లూటీకి స్కెచ్

ఓ బట్టల దుకాణంలో మహిళా కిలాడీలు చేతివాటం చూపెట్టారు. కొనుగోలు కోసం వచ్చిన ఐదుగురు మహిళలు షాపు యజమాని కళ్ళు కప్పి రూ. 20 వేల విలువ చేసే చీరలు, షార్ట్స్ మాయం చేసిన సంఘటన సంచనంగా మారింది.. సీసీ కెమెరాలు వారిని గట్టడం తో కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యారు.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.. ప్రతి శుక్రవారం సంత (అంగడి ) జనాలతో రద్దీగా ఉంటుంది. ఇది గమనించిన ఐదుగురు మహిళా దొంగలు షాపులోకి వెళ్ళారు.. ఒకరు షాపు నిర్వాహకున్ని బట్టలు చూపించమని మాటల్లో పెట్టారు.. మిగతా దొంగలు విలువైన బట్టలను దోచుకున్నారు. షాపు యజమానికి రెండు షాపులు ఉన్నాయి. అయితే రెండో షాప్ లో సీసీ కెమెరా దృశ్యాలు గమనించిన నానో ఫ్యాషన్ యజమాని పవన్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ మహిళా దొంగలకు దేహశుద్ధి చేశారు.ఈ క్రమంలో ముగ్గురు పరారయ్యారు. ఇద్దరిని పట్టుకున్న షాప్ యజమానులు పోలీసులకు అప్పగించాడు. గత కొంతకాలంగా మండల కేంద్రాన్ని ఎంచుకొని అంగడి రోజు కిరాణా షాప్ లో చొరబడి నూనె డబ్బాలు సబ్బులు, సర్ఫులు(డీటేర్జెంట్) సైతం తదితర వస్తువులు దోచుకున్న సంఘటనలు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. పరారైన వారి కోసం విచారణ జరుపుతున్నారు.