ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్ యూజర్లకు గట్టి షాకివ్వనుంది. ఆ రెండు ఫ్లాట్‌ఫామ్‌లలో యాడ్స్‌ప్లే అవ్వకూడదనుకుంటే అందుకు యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన యురేపియన్ యూనియన్‌లో అందుబాటులోకి రానుందని సమచారం. త్వరలో మిగిలిన దేశాలకు సైతం వర్తించనుంది. దీనిపై మెటా అధినేత మార్క్ జుకర్ బెర్గ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
2019 నుంచి మెటా సేవలపై యూరోపియన్ యూనియన్ దేశాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెటా అనుమతి లేకుండా వినియోగదారుల డేటాను సేకరిస్తుందని ఆరోపిస్తున్నాయి. నాటి నుంచి న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో మెటా యాజమాన్యం పెయిడ్ సర్వీసులపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వస్తే యూజర్లు పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఏ ఒక్కదానికి చెల్లించినా.. మరొకటి ఉచితంగా ఇవ్వనున్నది. ఇక పెయిడ్ వెర్షన్‌లో యూజర్ల నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఒకేసారి చెల్లించి వాడుకోవడంతో పాటు.. లేదంటే వేర్వేరుగా ప్లాన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.