Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

.ఈ వారం మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (03-09-2023 నుండి 09-09-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు 🗓

🐐 మేషం (03-09-2023 నుండి 09-09-2023)

శుభకాలం. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. ఉద్యోగ భవిష్యత్తు బాగుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి వల్ల మంచి జరుగుతుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (03-09-2023 నుండి 09-09-2023)

అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసి గొప్ప ఫలితాలను పొందుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొంటారు. తోటవారికి సహాయం చేస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (03-09-2023 నుండి 09-09-2023)

అదృష్టం ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కాలం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. గతకొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. విరోధులు పెరగకుండా చూసుకోవాలి. వారాంతంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదైవారాధన శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (03-09-2023 నుండి 09-09-2023)

శుభసమయం. అదృష్ట ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన,ధాన్యాది లాభాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన వస్తువులు కొంటారు. అధికారులు కీలకమైన మీ అభివృద్ధికి దోహదపడే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతిధ్యానం శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (03-09-2023 నుండి 09-09-2023)

శుభకాలం. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. తోటివారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు వచ్చాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక విషయాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచిఫలితాలు ఉన్నాయి. ఇష్టదైవ స్తుతి శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (03-09-2023 నుండి 09-09-2023)

సత్వర విజయాలు ఉన్నాయి. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు వెలువడుతాయి. కీలక విషయాల్లో మనోబలంతో ముందుకు సాగి అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. తోటివారి సహకారంతో అనుకున్నది దక్కుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా మీ అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఎంత శ్రమిస్తే అంత ఫలితం వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన మేలు చేస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల (03-09-2023 నుండి 09-09-2023)

లక్ష్యసిద్ధి ఉంది. చురుగ్గా పనిచేయండి. వృత్తి,వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కన్నా మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. దైవబలం అనుకూలిస్తోంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (03-09-2023 నుండి 09-09-2023)

చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి. కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య విషయాల్లో ఆవేశం పనికిరాదు. వారాంతంలో శాంతి చేకూరుతుంది. శ్రీలక్ష్మీదేవి స్తోత్రం చదివితే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (03-09-2023 నుండి 09-09-2023)

విజయసిద్ధి ఉంది. ప్రారంభించి పనిలో ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుపుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన మనఃస్సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (03-09-2023 నుండి 09-09-2023)

అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొనిపోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపించడం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (03-09-2023 నుండి 09-09-2023)

మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. పక్కాప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు లేకుండా పెరగాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు అవుతుంది, అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రులకు మేలు చేసే సూచనలు. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (03-09-2023 నుండి 09-09-2023)

శుభయోగం ఉంది. ప్రారంభించబోయే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. గొప్ప సంకల్పబలంతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి, సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. విష్ణుసహస్ర నామ పారాయణ వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈