తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ నేతలు సహా ప్రతిపక్ష నేతలు పొలిటికల్‌గా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. రేవంత్ రెడ్డి ట్విట్టర్ బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌లో‘గల్లీలో సవాల్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు.. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన ‘నిక్కర్’.. లిక్కర్.. లాజిక్కు’ అంటూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఉన్న ఫొటోను షేర్ చేశారు.
రేవంత్ రెడ్డి కవిత మధ్య ట్విట్టర్ వార్
