Politics

తెదేపా అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం: చంద్రబాబు

తెదేపా అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం: చంద్రబాబు

కరెంట్‌ కోతలతో జగన్‌ ప్రభుత్వం ప్రజలను అనేక కష్టాలు పెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్‌-2 సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ కరెంట్‌ లేక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. డబ్బు సంపాదన తప్ప వైకాపా నేతలకు మరో పని లేదు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారు.’’ అని చంద్రబాబు విమర్శించారు. ఇసుక దొరక్క పేదలు ఇళ్లు కట్టుకోలేక పోతున్నారని అన్నారు.  తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు.