Agriculture

తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజామున 5 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్‌డీపీఎస్‌) ప్రకటించింది.

అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం (123 మి.మీ), మెదక్‌ జిల్లా చిలిప్‌చేడు మండలం చిట్కూల్‌ (116.8 మి.మీ), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి (116.3 మి.మీ), సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం లక్ష్మీసాగర్‌లో (116.3 మి.మీ.) ), రాజన్న సిరిసిల్ల జిల్లా జీఏఎన్‌ నగర్‌లో 102.8 మి.మీ), రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో 102.0 మి.మీ) వర్షంపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌.

రాష్ట్రంలో వివిధ మండలాల్లో వర్షపాతం వివరాలు..