Politics

నేడు విశాఖలో ఏపీ గవర్నర్‌ పర్యటన

నేడు విశాఖలో ఏపీ గవర్నర్‌ పర్యటన

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఐదు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోర్టు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం నోవాటెల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సులో పాల్గొంటారు.సాయంత్రం ఏయూ స్నాతకోత్సవంలో చాన్సలర్‌ హోదాలో పాల్గొననున్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోని రైల్వే గెస్ట్‌ హౌస్‌కు చేరుకోనున్నారు. 11వ తేదీ సాయంత్రం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మంగళవారం గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.