స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసింది. నంద్యాల ఆర్.కే. ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబర్ 29/2021 కేసులో అరెస్ట్ చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
చంద్రబాబు నాయుడును సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు స్టేట్ మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు.
కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబును సుమారు గంటన్నర పాటు విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది