గూగుల్ తమ పిక్సెల్ వాచ్ 2ను ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 4న విడుదల చేయబోతోంది. ‘మేడ్ బై గూగుల్’ కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించనుంది. అక్టోబరు 5 నుంచి భారత్‌లోనూ ఇది అందుబాటులోకి వస్తుందని గూగుల్ ఇండియా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి ఉంచుతామని తెలిపింది. దీంతోపాటు పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు, పిక్సెల్ బడ్స్ ప్రొ కూడా విడుదల కానున్నాయి. భారత్‌లో పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ల ప్రీ ఆర్డర్లు వచ్చే నెల 5 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు పిక్సెల్ వాచ్ 2 ధర, ఇతర వివరాలను గూగుల్ వెల్లడించలేదు. డిజైన్‌కు సంబంధించిన వీడియోను మాత్రం ఎక్స్ (అంతక్రితం ట్విటర్)లో పోస్టు చేసింది. గతంలో వచ్చిన పిక్సెల్ వాచ్ తరహాలోనే ఇది కూడా ఉంది. అయితే పిక్సెల్ వాచ్‌ను మాత్రం అప్పుడు భారత్‌లో విడుదల చేయలేదు.
ఇండియాకు వచ్చేస్తున్న Google Pixel Watch 2

Related tags :