Politics

33 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన కిషన్ రెడ్డి

33 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన కిషన్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపుపై టీ-బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రాష్టంలోని అన్ని జిల్లాల అధ్యక్షులను మార్చి, నూతన అధ్యక్షులను బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమించారు. వీరితో పాటుగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు కుడా ప్రభారీలను తెలంగాణ బీజేపీ నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నూతన అధ్యక్షుల జాబితాను శనివారం ప్రకటించారు.

1 ఆదిలాబాద్ బద్దం లింగ రెడ్డి. 2 నిర్మల్ – ముల్కల మల్లారెడ్డి. 3 కొమరం భీం ఆసిఫాబాద్ ఎం. మహేష్ బాబు. 4 నిజామాబాదు కళ్లెం బాల్ రెడ్డి. 5 కామారెడ్డి ఎర్రం మహేష్. 6. కరీంనగర్ మీసాల చంద్రయ్య. 7 జగిత్యాల చంద్రశేఖర్ (సంగారెడ్డి ). 8 పెద్దపల్లి -రావుల రాంనాథ్. 9 రాజన్న సిరిసిల్ల – గంగడి మోహన్ రెడ్డి. 10 సంగారెడ్డి – జె రంగారెడ్డి. 11 మెదక్ -డాక్టర్ ఎస్.మల్లా రెడ్డి. 12 రంగారెడ్డి రూరల్ -పి అరుణ్ కుమార్. 13 వికారాబాద్ -వేదవెల్లి రాజవర్ధన్ రెడ్డి. 14 మేడ్చల్ అర్బన్ -గిరి మోహన్ శ్రీనివాస్. 15 మేడ్చల్ రూరల్ — వేముల నరేందర్ రావు. 16 నల్గొండ – రావికంటి ప్రదీప్ కుమార్. 17 యాదాద్రి భువనగిరి – జె. శ్రీకాంత్. 18 మహబూబ్ నగర్ – కె.వి.ఎల్.ఎన్. రెడ్డి (రాజు). 19 వనపర్తి – బోసుపల్లి ప్రతాప్. 20 నాగర్ కర్నూల్ – తూటుపల్లి రవి కుమార్. 21 జోగులాంబ గద్వాల – బి. వెంకట్ రెడ్డి. 22 నారాయణపేట – కడారి జంగయ్య యాదవ్. 23 హన్మకొండ- అడ్లూరి శ్రీనివాస్. 24 వరంగల్ – కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. 25 జయశంకర్ భూపాలపల్లి -సన్నె ఉదయ్ ప్రతాప్. 26 జనగాం – యాప సీతయ్య. 27 మహబూబాబాద్ -బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 28 ములుగు – ఏర్పుల వెంకట రమణ. 29 ఖమ్మం – సరికొండ విద్యాసాగర్ రెడ్డి. 30 భద్రాద్రి కొత్తగూడెం – రంగరాజు రుక్మా రావు. 31 గోల్కొండ- గోషామహల్ – సంద్రాసు నందకుమార్ యాదవ్. 32 మహంకాళి-సికింద్రాబాద్ – నాగురావ్ నామాజీ, న్యాయవాది. 33 హైదరాబాద్ సెంట్రల్ – టి అంజన్‌కుమార్ గౌడ్ లను నియమించింది.