తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా లండన్‌లో తెదేపా ఎన్‌ఆర్‌ఐలు నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రస్తుతం లండన్‌లో బస చేసిన ప్రాంతానికి సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ‘మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్‌లో’ ‘అక్రమ అరెస్ట్‌ను ఖండిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం’ ‘సైకో పోవాలి.. బాబు రావాలి’ అని నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు. లండన్‌లో మరోచోట ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో స్వాతిరెడ్డి, ఇతర కార్యకర్తలు నిరసన తెలిపారు. బ్రిటన్‌లోని ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించారు.
నెదర్లాండ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ తీరును వారంతా ముక్తకంఠంతో ఖండించారు.
అమెరికాలోని నార్త్ కరోలినా, చికాగో, డెట్రాయిట్‌లలో ప్రవాసులు నల్ల దుస్తులు ధరించి చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నిరసన తెలిపారు.