Videos

ఆ హిట్ పాట షూటింగ్ తర్వాత TT ఇంజెక్షన్!

ఆ హిట్ పాట షూటింగ్ తర్వాత TT ఇంజెక్షన్!

‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’ ఎప్పటికీ ఒక సెన్సేషనే. ‘మోహ్రా’లో అక్షయ్‌ కుమార్‌ – రవీనా టాండన్‌లపై చిత్రీకరించిన ఈ పాట ఓ సూపర్‌ డూపర్‌ హిట్‌. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ పాట చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఇబ్బందుల గురించి నటి రవీనా తాజాగా వెల్లడించారు.

‘‘నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఈ పాటను చిత్రీకరించారు. చుట్టూ ఇనుప చువ్వలు.. పరిసరాలు అపరిశుభ్రం ఉన్నాయి. దానివల్ల కాళ్లకు చెప్పుల్లేకుండా షూట్‌లో పాల్గొనడం నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్‌ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చింది. డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు Knee pads వేసుకున్నా. తీరా, ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు గాయాలయ్యాయి. tetanus ఇంజెక్షన్స్‌ తీసుకోవాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత నేను అనారోగ్యానికి గురయ్యా. ఇలా ఆ పాట షూట్‌లో ఇబ్బందులు పడ్డా. మీకు స్క్రీన్‌పై కనిపించే గ్లామర్‌ వెనుక ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. ఇబ్బందులు పడినప్పటికీ పాటకు వచ్చిన రెస్పాన్స్‌కు మేము ఎంతో ఆనంద పడ్డాం’’ అని తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవీనా టాండన్‌ చెప్పారు.