Politics

తెదేపా నేతలను వదలని ఖాకీలు

తెదేపా నేతలను వదలని కాకిలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై ధర్నాకు దిగుతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొడుతున్నారు. కాన్వాయ్‌కి అడ్డుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

చంద్రబాబు నాయుడును పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు .దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగుతున్నారు. వారిని పోలీసులు అడ్డుకుని రహదారిని క్లీయర్ చేస్తున్నారు.

టీడీపీ అదినేత చంద్రబాబు అరస్ట్ నేపధ్యంలో జిల్లాలో కొనసాగుతున్న టిడిపి నేతల ముందస్తు అరెస్టులు. టిడిపి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను అదుపులోకు తీసుకుని టెక్కలి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అటు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ను అరెస్ట్ చేసేందుకు అతని నివాసం వద్దకు చేరుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే అశోక్ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పాలకొండ టిడిపి ఇన్ చార్జ్ నిమ్మక జయక్రిష్ణ ను అతని స్వగ్రామం రాజపురంలో హౌస్ అరస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు, ముందస్తు చర్యలలో బాగంగా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.