Politics

ఏమిటీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం?

ఏమిటీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం?

అసలు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం ఎలా మొదలైందంటే..

►2014 జులైలో డిజైన్‌ టెక్‌ సంస్థకు చెందిన సంజయ్ డాగా అప్పటి ముఖ్యమంత్రి కలిశారు. టీడీపీ నాయకుడు ఇల్లెందు రమేష్ ద్వారా సంజయ్ డాగా.. చంద్రబాబును కలిసి స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై చర్చించారు. ఇదే రోజు స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు చంద్రబాబు కమిట్‌మెంట్‌ ఇచ్చారు. 22.8. 2014న సిమెన్స్ కంపెనీ, డిజైన్టెక్, ఇల్లందుల రమేష్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ఏపీ సచివాలయంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.

►ఈ ప్రెజెంటేషన్‌ తర్వాత ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ ప్రారంభించారు. 10.09.2014న తన సన్నిహితుడు సుబ్బారావు(A-3)ను ఎండీగా మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ(A-4)ను సీఈగా నియమించారు. లక్ష్మినారాయణ, సుబ్బారావు నియామకాలను ఉన్నతాధికారులు వ్యతిరేకించినా.. క్యాబినెట్ అనుమతి లేకుండానే వీరని ఎండీ, సీఈఓగా చంద్రబాబు నియమించారు. ఎలాంటి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నా క్యాబినెట్ అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఉల్లంఘిస్తూ చంద్రబాబు నియామకాలు కానిచ్చారు

►20.10.2014న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు. 07.10.2014న చంద్రబాబు కుట్రపూరితంగా సుబ్బారావును ఉన్నత విద్యాశాఖలో ఎక్స్ అఫిషియో సెక్రెటరీగా నియమించాడు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు. ఆయన ఆదేశాలతోనే సిమెన్స్, టెక్ డిజైన్ ప్రతినిధులు ఎలాంటి బిల్లులు, ఎస్టిమేషన్లు లేకుండా డీపీఆర్లు తయారు చేశారు.

►చంద్రబాబు ఆదేశాలతో ఈ డీపీఆర్‌ను క్యాబినెట్ మీటింగ్‌కి ఒకరోజు ముందు 15.02.2015న తయారు చేశారు. ఇదే డీపీఆర్‌ను 16.02.2015న జరిగిన క్యాబినెట్లో చంద్రబాబు ఓకే చేశారు. సాధారణ ఎజెండాలో లేకున్నా స్పెషల్ ఐటమ్గా స్కిల్డెవలప్మెంట్ డీపీఆర్ను క్యాబినెట్ టేక్అప్ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా 546 కోట్లతో ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో 90శాతం నిధులను డిజెన్టెక్, సిమెన్స్ కంపెనీ గ్రాంట్ ఇన్ ఏయిడ్గా అందిస్తుందని నిర్ణయించారు. ఇందులో ఏపీ ప్రభుత్వం మిగిలిన శాతం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ముందు నుంచీ కుట్రపూరితంగానే ఆలోచించిన చంద్రబాబు ఎలాంటి థర్డ్ పార్టీ ఎంక్వైరీ లేకుండా డీపీఆర్‌ను ఓకే చేశారు

►డీపీఆర్ సాధ్యాసాధ్యాలపై ఎలాంటి పరిశీలనలు చేయకుండానే ఖర్చుకు సంబంధించి అంచనాలు లేకుండానే ఏకపక్షంగా చంద్రబాబు నిర్ణయం మేరకు ప్రాజెక్టు అనుమతిచ్చారు. ఈ కేసులో సీమెన్స్ సంస్థతో ఎండీ సుబ్బారావుకు మధ్య జరిగిన కీలక ఈమేయిల్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ మెయిల్‌లో రూ.3319 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చూపెడుతూ అందులో ప్రభుత్వం నుంచి రూ. 370 కోట్లు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. ఈ ప్రభుత్వ నిధులను ఎలా షెల్ కంపెనీల ద్వారా దారిమళ్లించాలో చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్ణయించిన్టలు ఈ-మెయిల్స్‌లో స్పష్టమైంది.

►ఈ ప్రాజెక్టులో 3000కోట్లు గ్రాంట్ఇన్ ఏయిడ్గా ఇస్తామని చెప్పిన సీమెన్స్ సుబ్బారావుతో జరిగిన ఈమేయిల్స్లో మాత్రం 330కోట్లు లాభంగా చూపెట్టింది. అంటే ముందు నుంచీ 3000 కోట్లు ఇస్తామనేది పూర్తి అబద్ధం అని ఈ- మెయిల్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నిధులను రెండు దఫాలుగా పంచుకోవడంలో భాగంగా మొదటి దఫా 115కోట్లు, రెండో దఫాలో 214కోట్లు ప్రభుత్వ నిధులను దారిమల్లించేందుకు పథకం వేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఈ నిర్ణయాలు పూర్తిగా ఈ మెయిల్‌లో బట్టబయలయ్యాయి. ఇక రెండేళ్లలో ఆరు క్లస్టర్లకు 55కోట్ల చొప్పున మొత్తం 330కోట్లు చెల్లించేంందుకు సిద్ధమైంది. అయితే సీమెన్స్ నుంచి ఒక్కరూపాయి కూడా రాకుండానే ప్రభుత్వం మొత్తం 330కోట్లు విడుదల చేసింది. దీనికి కావాల్సిన అనుబంధ డాక్యుమెంట్లు లేకుండానే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది.

►స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ ద్వారా డబ్బులు దారిమల్లించేందుకు ముందునుంచే చంద్రబాబు పకడ్బందీ స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా తన సన్నిహితుడు సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టాడు. జీవో నెంబర్-17 ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ అనే విభాగంను ఏర్పాటు చేసిన చంద్రబాబు. 04.03.2015న సుబ్బారావు ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు ఆధ్వర్యంలోనే క్యాబినెట్ 371కోట్లు ప్రభుత్వ వాటా కింద విడుదల చేసేందుకు అనుమతిచ్చింది. ఈ నిధులను విడుదల చేస్తూ 30.06.2015న జీవో నెంబర్-4 ద్వారా 371కోట్లు విడుదల చేశారు.

►ఈ కుంభకోణంలో ఎక్కడా ఇతర అధికారుల ప్రమేయం లేకుండా చంద్రబాబు ఫైల్స్ మూవ్మెంట్ కోసం గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ప్రమేయం లేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డాడు. ఇందులో ఏ-3గా ఉన్న సుబ్బారావుకు ఏకంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ సమానమైన అధికారాలు కట్టబెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నుంచి ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నేరుగా చంద్రబాబుకు ఫైల్స్ వెళ్లే ద్వారా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు.

►సీమెన్స్ సంస్థకు అనుకూలంగా 90 శాతం భాగస్వామ్యం తప్పకుండా చెల్లించాలనే నిబంధనను సైతం చంద్రబాబు పక్కనబెట్టారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్‌లో డిప్యూటి సీఈఓగా నియమించారు. సుబ్బారావు ప్రతిపాదన మేరకే యూపీ క్యాడెర్ ఐఏఎస్ అధికారి అపర్ణ(ఏ-6) 17.07.2015న డిప్యూటీ సీఈఓగా నియమించారు

►11.03.2015న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో టెక్నాలజీ పార్ట్నరన్స్ అయిన సిమెన్స్, డిజైన్టెక్లు 2500కోట్లు పెట్టుబడి పెడతారని చెప్పాడు. 04.11.2016లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించిన చంద్రబాబు టెక్నాలజీ పార్ట్‌నర్స్‌ అయిన సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలు చెల్లించాల్సిన మొత్తంపై ప్రశ్నించకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో నోట్‌ ఫైల్స్‌ను పరిశీలిస్తే… నేరుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రెటరీ ఆదేశాలతో వెంటనే నిధులు విడుదలయ్యాయి.