Politics

రాజమండ్రి జైలులో ప్రత్యేక గది సిద్ధం. ఇంటిభోజనానికి అనుమతి.

రాజమండ్రి జైలులో ప్రత్యేక గది. ఇంటిభోజనానికి అనుమతి.

ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధించింది. అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మరో వైపు సెంట్రల్‌ జైలు వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జైలు వద్ద భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు.

చంద్రబాబు పిటిషన్‍పై నిర్ణయం వెల్లడించిన ఏసీబీ కోర్టు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని ఆదేశం. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశాలు. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశం. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు.