తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఆమె కృషి, సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. సాయుధ ఉద్యమ సమయంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు ఎనలేనివని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రతి ఏటా ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని, తెలంగాణ పోరాట యోధులను ప్రభుత్వం సమున్నతి రీతిలో స్మరించుకుంటుందని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమం, మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
మహిళ అభ్యున్నతికి ఐలమ్మ కృషి ఎనలేనిది: కేసీఆర్

Related tags :