చంద్రబాబుకి రిమాండ్ విధింపు.. రాజమండ్రి జైలుకు తరలింపు… వైసీపీలో సంబరాలు… టీడీపీలో విషాదచ్ఛాయలు. తెలుగు రాజకీయాల్లో ఇదొక కీలక తరుణం. 371 కోట్ల అవినీతి కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా నిర్ధారించిన విజయవాడ ఏసీబీ కోర్టు… రిమాండ్ విధిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చింది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు జైలు యోగం అనేది నేషనల్ బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇదొక మాయని మచ్చ. అటు.. పెళ్లిరోజున జైలుకెళ్లాల్సి రావడం అనేది చంద్రబాబును వ్యక్తిగతంగా కుంగదీసే అంశం. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దేవుడి ముందు ఎవరూ తప్పించుకోలేరని చంద్రబాబు విషయంలో నిజమైందన్నారు నాని. లోకేశ్ ఇప్పటికైనా డైలాగ్స్ మానేయ్యాలని హితవు పలికారు. స్కిల్ స్కామ్ చంద్రబాబును సీఎం జగన్ జైలుకు పంపిన విషయం కూడా లోకేశ్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలని ఎద్దేవా చేశారు. బాబును అరెస్ట్ చేయగానే.. అసలు పుత్రుడి కంటే దత్త పుత్రుడి హడావిడి ఎక్కువైందన్నారు. ప్యాకేజీ తీసుకొని , అర్ధరాత్రి వచ్చి పవన్‌కళ్యాణ్ హడావుడి చేశారని విమర్శించారు.
దత్తపుత్రుడి డ్రామా ఎక్కువైంది: కొడాలి
Related tags :