ScienceAndTech

సూట్‌కేసులో టీవీ చూస్తారా?

సూట్‌కేసులో టీవీ చూస్తారా?

టీవీ చూడాలంటే ఇంతకు ముందు ఓ టేబుల్‌ ఉండాలి. ఇప్పుడైతే ఓ గోడ చాలు. కానీ ఊరికే ఆరు బయట కూర్చునీ, కారులో షికారు కెళుతూ కూడా టీవీ చూడగలిగే అవకాశాన్ని కల్పిస్తున్నది ఎల్‌జీ సంస్థ. బ్రీఫ్‌కేస్‌ లాంటి బాక్స్‌లో ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకుపోవచ్చు. దీనిపేరు ‘ఎల్‌జీ స్టాన్‌బైమీ గో’. 27 అంగుళాల స్క్రీన్‌ ఉన్న ఈ వైర్‌లెస్‌ పరికరం బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బ్లూటూత్‌, ఎయిర్‌ప్లేలాంటి వాటి ద్వారా కనెక్ట్‌ కావచ్చు. మన ఇష్టాన్ని బట్టి స్క్రీన్‌ను అడ్డంగా, నిలువుగా అమర్చుకోవచ్చు. బాక్స్‌లోనే ఉంచి గేమింగ్‌ బోర్డులానూ వాడుకోవచ్చు. ఈ టచ్‌స్క్రీన్‌ టీవీని వాయిస్‌ కంట్రోల్‌, రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేయొచ్చు. ధర రూ. 83 వేలు. lg.com ద్వారా కొనుక్కోవచ్చు.