Food

గుడ్డు వీరికి ప్రమాదకరం

గుడ్డు వీరికి ప్రమాదకరం

* కొలస్ట్రాల్‌ సమస్య ఉన్నవారు గుడ్డు అస్సలు తినకూడదు. తింటే ఒక్కసారిగి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది.

* అధిక రక్తపోటు ఉన్న పేషెంట్లు తింటే మరింత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. తినాలనుకుంటే గుడ్డులోని పసుపు భాగాన్ని బయటకు తీసి తినవచ్చు.

* ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే గాక శరీరంలో అదనపు ప్రోటీన్లు, కొవ్వు కూడా పెరుగుతుంది.

* మధుమేహం పెరిగే ప్రమాదం ఎక్కువే. ఇది ఇన్సులిన్‌ నిరోధకతను కూడా పెంచుతుంది.

*ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. అతిగే తింటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తు‍న్నారు వైద్యులు