తెలంగాణలోని వైద్య కళాశాలల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ అంశంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా న్యాయస్థానం సమర్థించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలినవన్నీ తెలంగాణ వారికేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు జీవో 72ను సవాల్ చేస్తూ పలువురు ఏపీ విద్యార్థులు పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఏపీ విద్యార్థుల పిటిషన్లను కొట్టివేసింది.
తెలంగాణ మెడికల్ సీట్లలో స్థానిక రిజర్వేషన్లకు పచ్చజెండా
Related tags :