ScienceAndTech

విజయవంతంగా దూసుకెళ్తున్న ఇస్రో ఆదిత్య-ఎల్1

విజయవంతంగా దూసుకెళ్తున్న ఇస్రో ఆదిత్య-ఎల్1

సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్​1 లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 256 X 1,21,973 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్‌ 19న చేపట్టనున్నారు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌-1 పాయింట్‌ను చేరుకోవాలంటే ఆదిత్య ఎల్‌-1కు నాలుగు నెలలు సమయం పడుతుంది.