Business

సిద్ధిపేటకు రైలు వస్తోంది

సిద్ధిపేటకు రైలు వస్తోంది

గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్‌ పూర్తవ్వగా.. శుక్రవారం నాడు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. బోగీలతో కూడిన ప్యాసింజర్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట రైల్వేస్టేషన్‌కు విజయవంతంగా చేరుకుంది. ఈ ట్రయల్‌ రన్‌ను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రాక్‌ వెంట తిరుగుతూ అన్నీ కుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయి రైల్వే సేవలు సిద్దిపేటకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు