ఆంధ్రప్రదేశ్ నుండి 10మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం న్యూయార్క్‌లోని ఐరాసలో జరుగుతున్న SDG Summitలో పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా కూడా వీరిని ఆహ్వానించారు. ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా, ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు.
ఐరాసలో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సందడి
Related tags :