Devotional

ఈ రాశివారికి ఆదాయం ఖర్చు సమానం-దినఫలాలు

ఈ రాశివారికి ఆదాయం ఖర్చు సమానం-దినఫలాలు

మేష రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులకు కూడా బాగానే అవకాశముంది. వృషభ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. మిథున రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలుకొని మీన రాశి వరకు 12 రాశుల వరకు గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): దూర ప్రయాణాలకు లేదా కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. వ్యాపార ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులకు కూడా బాగానే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువుల అకారణ విమర్శల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అధికా రులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో గానీ, సహాయ కార్యక్రమాల్లో గానీ పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్తగా వాహన యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామికి మంచి యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు మీ నుంచి గరిష్టంగా సహాయం పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తల్లితండ్రుల్లో ఒకరికి ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తు తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో పోటీదార్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు, అవివాహితులకు సానుకూల స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): బంధువుల విషయాల్లో తలదూర్చవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులతో ఇబ్బందులు పడ తారు. వృత్తి, వ్యాపారాలకు సబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించవద్దు. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఓర్పు, సహానాలతో వ్యవహరించడం మంచిది. పిల్లలు పోటీ పరీక్షల్లో ఆశ్చర్యకర విజయాలు సాధిస్తారు. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి తగ్గి ఊరట చెందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఒక్కటొక్కటిగా వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మిత్రులతో విందు, వినో దాల్లో పాల్గొంటారు. రోజంగా సంతోషంగా గడిచిపోవడానికి అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారాలు అనుభవిస్తారు. అనవసర పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడంపై ఆలోచి స్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అధికారులతో సమానంగా బాధ్య తలు నిర్వర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

ధనుస్సు (మూల,పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. కొందరు బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభి స్తుంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరు గుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. గౌరవ మర్యాదలకు ఎక్కడా లోటుం డదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆధ్యాత్మిక చింతన మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయ మార్గాల వల్ల మంచి ఫలితాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందు తాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. బంధు మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగు తాయి. కొందరు బంధువులు మీ మాటల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రముఖులతో పరి చయాలు లాభిస్తాయి. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆదాయం పెరు గుతుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఇతరులకు ఆర్థికంగా సహా యం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, వ్యాపారాలలో రాబడి బాగా పెరుగుతుంది. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఉద్యోగంలో అటు అధికారులకు, ఇటు సహోద్యోగులకు అండగా ఉంటారు. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.