Movies

‘చంద్రముఖి-2’ సెన్సార్‌ పూర్తి

‘చంద్రముఖి-2’ సెన్సార్‌ పూర్తి

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు ఈ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు చిత్రబృందం పేర్కొంది. అలాగే దీని ఫైనల్‌ రన్‌టైమ్‌ 157నిమిషాలు (2గంటల 37నిమిషాలు). ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. ఇక లారెన్స్‌ మొదటి పాన్‌ ఇండియా చిత్రంగా ఇది అలరించనుంది. అలాగే బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఇందులో రాజనర్తకిగా కనిపించనుంది. దీంతో ఈ చిత్రంపై బీటౌన్‌లోనూ ఆసక్తి నెలకొంది. 2005లో రజనీకాంత్‌ , జ్యోతిక, నయనతార నటించిన ‘చంద్రముఖి’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఈ ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇప్పటికే ప్రచారంలో జోష్‌ చూపిన మూవీ యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిపింది.