స్విట్జర్లాండ్‌లో పలువురు ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలిపారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.
కువైట్‌లో తెదేపా, జనసేన ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పనిచేసి వైకాపా సర్కార్‌కు చరమగీతం పాడాలన్నారు.