Food

మతిమరుపును మట్టుబెట్టే ఖర్జూర పాలు

మతిమరుపును మట్టుబెట్టే ఖర్జూర పాలు

జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది:
జ్ఞాపక శక్తిని మెరుగు పరుచుకోవడంలో ఈ డ్రింక్ బాగా సహాయ పడుతుంది. ఈ డ్రింక్ ని ఉదయాన్నే పెద్దలు లేదా పిల్లలు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు పిల్లలకు ఇస్తే.. వారు చదివినవి గుర్తుండే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే రోజంతా యాక్టీవ్ గా ఉంటారు.

కీళ్ల నొప్పులు:
పాలులో ఉండే కాల్షియం ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. దీంతో ఎముకలకు సంబంధించిన కీళ్ల నొప్పులు వంటికి తగ్గుతాయి. ఖర్జూరం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. వాపు వంటి వాటిని తగ్గిస్తుంది.

స్కిన్ గ్లో అవుతుంది:
క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో చర్మం నేచురల్ గానే కాంతి వంతంగా తయారువుతుంది. అంతే కాకుండా స్కిన్ పై మంట, చికాకు వంటి వాటిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగాలి.

రక్త హీనత ఉండదు:
ఈ డ్రింక్ తాగితే రక్త హీనత సమస్య ఉండదు. ఖర్జూరంలో ఐరన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి.. రక్త హీనత సమస్య రాదు. హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.

కండరాలు బలంగా తయారవుతాయి:
పాలు, ఖర్జూరం కలిపిన డ్రింక్ తాగడం వల్ల కండరాలు బలంగా, దృఢంగా తయారవుతాయి. ఈ రెండింటిలో ఉండే ప్రోటీన్లు.. కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.