కాల్గరీ కెనడాలో, శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల-శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజ్‌కుమార్ శర్మ పూజలు నిర్వహించారు. వాలంటీర్లు, వ్యాపార యజమానులు సహాయాన్ని అందించారు.
హేమ-హర్షిణి ట్రక్ ను అందంగా అలంకరించారు. కాల్గరీ ఎమ్మెల్యే పీటర్ సింగ్ అతిథిగా హాజరయ్యారు. లోహిత్, ఓం సాయి, ఫణి భజనలతో, పాటలతో గణపతిని స్తుతించారు. కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ వరకు పెద్దసంఖ్యలో భక్తుల మధ్య జరిగింది.
కెనడాలో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్ కచేరీలో ఆరతి శంకర్, అంజన శ్రీనివాస్‌లు, ఆదిత్య నారాయణ్ మృదంగంతో, రమణ ఇంద్రకుమార్ ఘటంతో, రత్తన్ సిద్ధు తంబురాలతో సహకరించారు. దేవి నవరాత్రి ఉత్సవాలకి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.