DailyDose

లండన్‌లో హైదరాబాదీ హత్య-నేరవార్తలు

లండన్‌లో హైదరాబాదీ హత్య-నేరవార్తలు

* లండ‌న్‌లో హైద‌రాబాద్ వాసి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఉపాధి కోసం లండ‌న్ వెళ్లిన రైసుద్దీన్‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు దారుణంగా చంపేశారు. హ‌త్య చేశాక న‌గ‌దు, వ‌స్తువుల‌ను దుండ‌గులు దోచుకెళ్లారు. కుమార్తె పెళ్లి కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చే స‌మ‌యంలో రైసుద్దీన్ హ‌త్య‌కు గుర‌య్యాడు. అక్టోబ‌ర్ 5వ తేదీన కుమార్తె పెళ్లి ఉండ‌టంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. రైసుద్దీన్ హ‌త్య‌కు గురైన విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మృత‌దేహం త్వ‌ర‌గా హైద‌రాబాద్‌కు వ‌చ్చేలా చూడాల‌ని కుటుంబ స‌భ్యులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

* నలుగురు వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Woman Gang Raped) అనంతరం పొలాల వద్ద ఆమెను పడేశారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పొలం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న 35 ఏళ్ల మహిళను కొందరు వ్యక్తులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

* రేపు ACB కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ. మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ పిటీషన్ వేసిన CID.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కలేదు. బాబు పిటిషన్‌ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ.. విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వాడీవేడి వాదనలు జరిగాయి. పీసీ యాక్ట్‌ 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా? లేదా? అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు.. సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది. చంద్రబాబు తరపున సీనియర్‌ లాయర్లు సిద్ధార్థ్‌ లూథ్రా, హరీష్‌సాల్వే, అభిషేక​ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ తరుణంలో.. ఈ పిటిషన్‌పై ఎంత మంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్‌ పశ్నించగా.. నలుగురం అంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్‌ రోహత్గీకి(ఏపీ ప్రభుత్వ తరుపున లాయర్‌) సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు. తొలుత.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు అయిన అంశాలపైనే హరీష్‌ సాల్వే వాదనలు(వర్చువల్‌)గా వినిపించారు. ‘‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్ట్‌ చేశారు. హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో.. సెక్షన్‌ 17 ఏ పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్‌ సాల్వే. ఈ సెక్షన్‌ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్‌ 17 ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు.

* మట్టి, బురద కాళ్లతో ఇంటి వరండా ముందు నుంచి పై అంతసస్తుకు తరుచూ తిరుగుతున్న ఇద్దరిని వారించిన వ్యక్తిపై దాడి చేయడంతో తలకు గాయమై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీబీనగర్‌ మండలంలోని జమీలాపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమీలాపేట గ్రామానికి చెందిన సయ్యద్‌ సలీం(60) అదే గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో అద్దె ఇంటి పైన మరో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పనికి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు లలిత్‌, అమర్‌లు శుభ్రం చేసిన వరండా నుంచి నుంచిపైకి కిందకు మట్టి, బురద కాళ్లతో నడుచుకుంటూ వెళ్తుండడంతో గమనించిన సలీం వారిని మందలించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సలీమ్‌ను ఇద్దరు కలిసి గోడకు నెట్టివేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.

* మానుకోట జిల్లా న్యాయస్థానం చరిత్రలో శుక్రవారం సంచలన తీర్పు వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జిల్లాకు చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్య ఘటనలో 2 సంవత్సరాల 11 నెలల్లో తీర్పు వచ్చింది. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ముందుకు సాగిన కేసు అనేక పరిణామాలు, విచారణ, సాక్ష్యుల వాంగ్మూలం ఇలా ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్‌.. నిందితుడు మంద సాగర్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ తీర్పు ఇచ్చారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు నుంచి కొనసాగుతున్న మానుకోట కోర్టులో.. ఉరి (మరణ శిక్ష) విధించడం ఇదే తొలిసారి. కేసు తుది వాయిదా, తీర్పు వెలువరించే సమయంలో కోర్టు హాల్‌ కిక్కిరిసింది. బాలుడి బంధువులు కోర్టు వద్దకు వచ్చారు. తీర్పు చెప్పిన వెంటనే అక్కడున్న వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా, తక్కువ కాలంలో కేసును ఛేదించిన పోలీసులను, న్యాయవాదులను న్యాయమూర్తి అభినందించారు.