Politics

తెలంగాణా తుది ఓటర్ల జాబితాలో 3.17కోట్ల మంది-తాజావార్తలు

తెలంగాణా తుది ఓటర్ల జాబితాలో 3.17కోట్ల మంది-తాజావార్తలు

* రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓటర్లలో ట్రాన్స్‌జెండర్లు 2,557 మంది ఉన్నారు. సర్వీస్‌ ఓటర్లు 15,338 మంది, ఓవర్సీస్‌ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇక 3.17 కోట్లకు పైగా ఉన్న ఓట్లలో మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితా స్పష్టంచేసింది.

* క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ రాష్ట్రాల్లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్ధితులు బీజేపీకి అనుకూలంగా లేవ‌ని ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ (Sharad Pawar) పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివ‌సేన కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని చెప్పారు. ఆప్ నేత సంజ‌య్ సింగ్ అరెస్ట్ రాజ‌కీయ క‌క్షసాధింపు చ‌ర్యేన‌ని ప‌వార్ పేర్కొన్నారు. ఆప్ నేత‌పై ఈడీ తీసుకున్న చ‌ర్య‌తో ఆప్‌, కాంగ్రెస్‌ను ఏకం చేస్తాయ‌ని విప‌క్ష ఇండియా కూట‌మి బ‌లోపేతం గురించి చెబుతూ శ‌ర‌ద్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఏడు లోక్‌స‌భ స్ధానాల‌కు గాను మూడు స్ధానాల‌ను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. విప‌క్ష కూట‌మిలో లుక‌లుక‌లు లేవ‌ని అన్నారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌ల‌క‌ని రాజ‌కీయ నేత‌ల‌ను టార్గెట్ చేసేందుకు ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌ను ప్ర‌యోగిస్తున్నాయ‌ని ప‌వార్ ఆరోపించారు.

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్‌ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. అవినీతికి కేరాఫ్‌ అయిన మోదీ(Prime Minister Modi).. సీఎం కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నీకు (ప్రధాని) దమ్ముంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించు. లేకపోతే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మోదీపై నిప్పులు చెరిగారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రిపై ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అసలు మోదీయే అత్యంత అవినీతిపరుడని అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నయాన్నారు.

* ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. తాజాగా మెన్స్‌ 4×400 మీటర్స్‌ రిలేలో బంగారు పతకం దక్కింది. దాంతో పసిడి పతకాల సంఖ్య 18కి చేరింది.

* ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు, సీఐడీ చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గురువారం ఉదయం 11 గంటలకు పిటిషన్లపై విచారణ జరుపనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించగా.. మరోసారి చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. అదే సమయంలో చంద్రబాబుకు బెయిల్‌ ఎందుకు ఇవ్వకూడో పేర్కొంటూ వాదనలు వినిపించారు. పెండ్యాల శ్రీనివాస్‌, మనోజ్‌ వాసుదేవ్‌ విదేశాలకు పరారయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించి న్యాయమూర్తి ఇద్దరు ఐటీ దర్యాప్తులో ఉన్నవారేనా? అని ప్రశ్నించారు.

* వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురాహి గ్రామంలో కారు, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులను పిలిభిత్‌ జిల్లా గుర్తించారు. వారణాసికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. వివరాల్లోకి వెళితే.. లారీ వెనుక నుంచి కారు ఢీకొట్టగా.. కారులోని వ్యక్తులు కాశీలో వారణాసిలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని దేశించార. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కాశీ విశ్వనాథున్ని ప్రార్థిస్తూ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

* బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇంటర్మీడియట్‌ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని పేర్కొన్నది.

* ఎవ‌రెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మ‌న కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. అందులో ఎవ‌రికి అనుమానం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఎవ‌ర్నీ అడిగినా, ఏ స‌ర్వే చూసినా గులాబీ జెండా, కేసీఆర్ గెలుస్త‌ర‌ని అంటున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు. కోస్గిలో 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. గ్యారెంటీగా గెలిచేది మ‌న‌మే.. వ‌చ్చేది మ‌న‌మే అని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఒక‌ప్పుడు కొడంగ‌ల్ ప్రాంతం వెనుక‌బ‌డ్డ ప్రాంతం. ఈ ప్రాంతానికి కృష్ణా జ‌లాలు తెచ్చే స‌నిలో కేసీఆర్ ఉన్నారు. ఆ ప‌ని జ‌ర‌గాలంటే కేసీఆర్‌ను దీవించాలి. డ‌బ్బులు పంచి గెల‌వాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ డ‌బ్బుల‌తో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు య‌త్నించి, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వ‌చ్చిండు. రేవంత్ రెడ్డి మీద చ‌ర్య తీసుకోవాల‌ని, విచార‌ణ జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. న్యాయం గెలుస్త‌ది.. ధ‌ర్మం నిల‌బ‌డ‌త‌ది. రేవంత్ త‌ప్పు చేశాడు.. కోర్టులో విచారించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయ‌న‌పై విచార‌ణ అయ్యేది ఖాయం.. జైలుకు పోయేది కూడా ఖాయం. కాంగ్రెసోళ్ల మాయ‌మాట‌లు న‌మ్మి ఆగం కావొద్దు అని హ‌రీశ్‌రావు కోరారు.

* అఫ్గానిస్థాన్‌ (Afghanistan) నుంచి శరణు కోరి వచ్చే వారిపై పాకిస్థాన్‌ (Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా వచ్చిన వారు తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. ఇలా అఫ్గాన్‌ నుంచి శరణార్థులుగా (Refugees) వచ్చిన వారు దాదాపు 17లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. వీరందర్నీ దేశం నుంచి పంపించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అఫ్గాన్‌ను 2021లో తాలిబాన్‌లు ఆక్రమించుకున్న తర్వాత అనేక మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13లక్షల మంది అఫ్గాన్‌ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. మరో 8.8లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగిటి ఇటీవల పేర్కొన్నారు. వీరందరూ ఈ నవంబర్‌ 1వ తేదీ నాటికి విడిచిపోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు. నవంబర్‌ తర్వాత పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించమన్నారు. పాకిస్థాన్‌ పౌరులు కాకున్నా.. ఐడీ కార్డులున్న వారి జాతీయతను గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్టింగ్‌నూ ఉపయోగిస్తామని పాక్‌ మంత్రి సర్ఫరాజ్‌ స్పష్టం చేశారు.

* జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదని ధ్వజమెత్తారు. వైకాపా పథకాల్లో అంతా డొల్లతనమేనని.. రాబోయేది జనసేన – తెదేపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తను పదవులపై ఆశపడి ఉంటే.. 2009లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో పవన్ ప్రసంగించారు. వైకాపా పాలనపై నిప్పులు చెరిగారు.