అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న తెలంగాణ కు చెందిన ఖమ్మం విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా పడ్డారు. ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్ (24) ఇండియానా స్టేట్ లో ఎంఎస్ చదువుతున్నాడు. యథావిధిగా మంగళవారం నాడు జిమ్‌కు వెళ్లిన వరుణ్‌పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో వరుణ్ రాజ్ తీవ్రంగా పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు .. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చిక్సిత పొందుతున్న వరుణ్ రాజ్ 5 శాతమే బతికే అవకాశముందని వైద్యులు తెలిపారు. వరుణ్‌పై దాడి చేసిన దుండగుడిని జోర్డాన్ ఆండ్రాడ్‌గా గుర్తించారు. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో భారతదేశ రాయబార కార్యాలయం, తన ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహాకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో వరుణ్ కుటుంబ సభ్యులతో తమ టీమ్ టచ్‌లో ఉంటారని వారికి కావాల్సిన సహాయం అందిస్తామని కేటీఆర్ హమీ ఇచ్చారు. ఈ తరుణంలో వరుణ్ రాజ్ ట్రీట్ మెంట్ సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –