DailyDose

93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ

93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ

చదువుకు వయసుతో సంబంధం లేదని 93 ఏళ్ల వృద్ధురాలు నిరూపించింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 83వ స్నాతకోత్సవంలో 93 ఏళ్ల రేవతి తంగవేలు ఇంగ్లీష్ లాంగ్వేజీలో పీహెచ్‌డీ పట్టా అందుకుని ఔరా అనిపించుకున్నారు. 1990లో టీచర్‌గా రిటైర్డ్ అయిన ఆమె సికింద్రాబాద్ లోని ఓ ఎడ్యు్కేషనల్ సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్ వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై ఆమె చేసిన పరిశోధనలకు గాను పీహెచ్ డీ పట్టాను సొంతం చేసుకున్నారు. రేవతి తంగవేలు ఈ వయసులో పీహెచ్‌డీ పట్టా సాధించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z