మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది, పోలీసులు తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళ్తున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది బుధవారం తనిఖీ చేశారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో కేటీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.
👉 – Please join our whatsapp channel here –