ఐదేళ్ల గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో బాలీవుడ్ బాద్ షా ఫుల్ జోరు మీదున్నాడు. ఇటీవలే పఠాన్, జవాన్‌లతో బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకెళ్లిన షారుక్.. ఇప్పుడు మరో మూవీతో ముందుకొస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డంకీ సినిమాలో నటిస్తున్నాడు. ఇవాళ షారుక్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే.. ఫన్‌తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో షారుక్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. ఇక రెండు భాగాల్లో రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. అయితే షారుక్ గత చిత్రాలు పఠాన్, జవాన్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో కమర్షియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే షారుక్‌లో ఉన్న సెన్సిబిలిటీని చాలా కాలంగా మిస్ అవుతున్న ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా అది చూడొచ్చని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ టీజర్‌ను మీరూ చూసేయండి మరి.
👉 – Please join our whatsapp channel here –